ఇది చరిత్రాత్మకమైన తీర్పు: సీజేఐ

Sat,November 9, 2019 10:57 AM

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఇవాళ చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సరిగ్గా 10:30 గంటలకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తీర్పును చదివి వినిపించారు. ఫైజాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ షియా వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిర్మోహీ అఖాడా పిటిషన్‌ను కూడా సుప్రీం కొట్టేసింది. నిర్మోహి పిటిషన్‌కు కాలం చెల్లిందని పేర్కొంది. తీర్పు కాపీ చదివేందుకు అరగంట సమయం పడుతుందని గొగొయ్ తెలిపారు.


'ఇది చరిత్రాత్మకమైన తీర్పు. ఈ తీర్పు ఏకగ్రీవం.. ఐదుగురు న్యాయమూర్తులది ఒకటే మాట. బాబ్రీ మసీదును కచ్చితంగా ఎప్పుడు నిర్మించారో ప్రాతిపదిక లేదు. బాబర్ కాలంలో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగింది. మత గ్రంథాలను బట్టి కోర్టు తీర్పు ఉండదు. పురావస్తుశాఖ నివేదికలో బాబ్రీ మసీద్ నిర్మాణం కింద మరో నిర్మాణం ఉంది. 12వ శతాబ్దంలోనే ఆలయం నిర్మించినట్లు పురావస్తు శాఖ ఆధారాలు చూపించింది. పురావస్తుశాఖ నివేదికపై మరింత అధ్యయనం జరగాలి. బాబ్రీ మసీద్‌ను ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదు. పురావస్తు పరిశోధనలను చూస్తే 12వ శతాబ్ధంలోనే ప్రార్థనా స్థలం ఉంది. పురావస్తుశాఖ నివేదికను ఊహాజనితమని కొట్టిపారేయలేమని' సుప్రీం వ్యాఖ్యానించింది.

2753
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles