ఇబ్బందులు తప్పవన్న ఆర్థిక నిపుణులు

Mon,August 19, 2019 10:35 PM

Financial troubles may face says experts

హైదరాబాద్: ఆర్థిక మాంద్యం బుసలు కొడుతున్నది. 2008లో లేమన్ బ్రదర్స్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలగా.. దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఇంతేస్థాయిలో విరుచుకుపడబోతున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా అప్పటి ఆర్థిక మాంద్యానికి కారణం కాగా, మరోమారు రాబోతున్న సంక్షోభానికి కూడా ఈ దేశమే ప్రధాన కారణంకాబోతున్నదని ప్రధాన ఆర్థిక వేత్తలు అనుమానిస్తున్నారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ వచ్చే రెండేండ్లలో మాంద్యం కోరల్లో చిక్కుకోవడం ఖాయమని నేషనల్ అసోసియేషన్ ఫర్ బిజినెస్ ఎకనామిస్ట్స్(ఎన్‌ఏబీఈ) నిర్వహించిన సర్వేలో పాల్గొన్న అత్యధిక మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 34 శాతం ఆర్థికవేత్తలు 2021 ఆఖరుకల్లా అమెరికా మాంద్యం బారిన పడుతుందని చెబుతుండగా.. 38 శాతం మంది 2020లోనే ఆ ఛాయలు కనిపిస్తాయని అంటుండగా, 2 శాతం మంది ఈ ఏడాదే ఆ ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమిలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు.

1270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles