దీపావ‌ళి కానుక‌.. డీఏ 5 శాతం పెంచిన కేంద్రం

Wed,October 9, 2019 02:42 PM

హైద‌రాబాద్: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డియ‌ర్‌నెస్ అల‌వెన్స్‌(డీఏ)ను అయిదు శాతం పెంచారు. ఈ విష‌యాన్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ప్ర‌క‌టించారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల సుమారు 50 ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ఉద్యోగులు, మ‌రో 62 ల‌క్ష‌ల మంది పెన్ష‌ర్లు ల‌బ్దిపొంద‌నున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క‌రువు భ‌త్యాన్ని పెంచాల‌న్న నిర్ణ‌యాన్ని కేబినెట్ స‌మావేశంలో తీసుకున్న‌ట్లు మంత్రి జ‌వ‌దేక‌ర్ తెలిపారు. పెంచిన దానితో ప్ర‌స్తుతం డీఏ 17 శాతానికి చేరుకుంటుంది. ఇది ఉద్యోగుల‌కు దివాళీ బ‌హుమ‌తి అని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్ర‌తిపాద‌న‌ వ‌ల్ల ప్ర‌తి ఏడాది ప్ర‌భుత్వ ఖ‌జానాపై సుమారు 16 వేల కోట్ల అద‌న‌పు భారం ప‌డ‌నున్న‌ది. కిసాన్ స‌మ్మాన్ కింద ఇచ్చే రైతు బంధు డ‌బ్బుల కోసం ఆధార్ అనుసంధాన ప్ర‌క్రియ‌ను న‌వంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు స‌డిలిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.
3937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles