మ‌హానంది వీధుల్లో మొస‌లి హ‌ల్‌చ‌ల్.. వీడియో

Wed,September 18, 2019 01:41 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లా మ‌హానందిలో అతి భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో రోడ్ల‌న్ని జ‌ల‌మయ్యాయి. చాలా గ్రామాలు నీట మునిగాయి. గ్రామాల్లోకి వరద నీటితో పాటు మొసళ్లు, పాములు వచ్చి చేరుతున్నాయి. ఈ క్ర‌మంలో మ‌హానందిలోని సలీమ్ నగర్ వీధుల్లో సుమారు మోకాలి లోతు వరకు నిలిచిన నీటిలో మొస‌లి తిరుగాడుతూ కనిపించింది. మొదట దీన్ని చేపలా భావించారట స్థానికులు. మొసలి అని తేలడంతో భయభ్రాంతులకు గురయ్యారు. మొసలి కొట్టుకుని వచ్చిన విషయాన్ని అటవీశాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే సలీమ్ నగర్ కు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మొసలిని బంధించారు. దాన్ని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని తెలిపారు.

2498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles