ఓనమ్ శుభాకాంక్షలు తెలిపిన క్రికెటర్స్..

Wed,September 11, 2019 04:12 PM

Cricket legend who wishes Onam good luck

ముంబయి: మళయాలీలు విశిష్టంగా జరుపుకునే పండుగ ఓనమ్. ఈ పండుగను కేరళలో 10 రోజుల పాటు సాంప్రదయబద్దంగా నిర్వహించుకుంటారు. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి రంగులతో అలంకరిస్తారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పిండి వంటలు తయారుచేస్తారు.. కుటుంబమంతా ఓ చోట చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

కాగా, ఓనమ్ సందర్భంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కేరళ ప్రజలకు, తన అభిమానులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపాలనీ, సుఖసంతోషాలతో ఉండాలని కోరాడు. కొన్ని రోజుల క్రితం తాను కేరళలో పర్యటించిన సంఘటనను గుర్తు చేస్తూ.. తన అభిమాని ప్రణవ్‌తో కలిసి గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. అతడు తన కాలి వేళ్ల సాయంతో అద్భుతంగా చిత్రాలు గీయగలడు. తన చిత్రం కూడా నా ముందే గీసి నాకు బహుమతిగా ఇచ్చాడని అన్నాడు. ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సచిన్ యజమాని.

ఇదే సందర్భంలో మరో క్రికెటర్ అజింక్యా రహానే కూడా మళయాలీలకు ఓనమ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని తన ట్విట్టర్‌లో తెలిపాడు. ఇటీవల విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే బ్యాటింగ్‌లో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

565
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles