72 ఏళ్లు పూర్తి చేసుకోవడం ప్రత్యేక సందర్భం: రాష్ట్రపతి

Wed,August 14, 2019 07:25 PM

Complete 72 yrs as a free nation at a very special juncture ramnathkovind


న్యూఢిల్లీ: స్వాతంత్ర్యం వచ్చి నేటితో 72 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ప్రత్యేకమైన సందర్భమని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. 73వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మరికొన్ని వారాల్లో అక్టోబర్ 2న జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు జరుగునున్నాయన్నారు. మహాత్మాగాంధీ కృష్టి, పట్టుదల, అకుంఠిత దీక్షతో బ్రిటీష్ పాలన నుంచి భారత్ కు విముక్తి కలిగిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చెప్పారు.

ఇటీవల జమ్మూకశ్మీర్, లఢఖ్ లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయడంతో..ఆయా ప్రాంతాల ప్రజలు మెరుగైన భవిష్యత్ ను అందుకోనున్నారని రాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు, వసతులు ఉన్నాయో..ఇక నుంచి జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రజలు కూడా అన్ని హక్కులు, సౌకర్యాలు పొందుతారని తెలిపారు. ఈ ఏడాది ప్రఖ్యాత సిక్కు గురువు గురునానక్ 550వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించుకున్నామని తెలిపారు.

1174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles