వరద ముంపు ప్రాంతాలకు రూ.6813 కోట్లు..

Tue,August 13, 2019 04:53 PM

cm FADNAVIS announced Rs 6813 crore assistance for the flood-affected areas


మహారాష్ట్ర: మహారాష్ట్రలోని వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతోన్న సహాయక చర్యలపై సీఎం ఫడ్నవిస్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. వరద ముంపులో దెబ్బతిన్న ప్రాంతాలకు రూ.6813 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ఫడ్నవిస్ ప్రకటించారు. వరద ముంపు అధికంగా ఉన్న కొల్హాపూర్, సాంగ్లీ, సతారా జిల్లాలకు రూ.4708 కోట్లు కేటాయించగా..కొంకన్, నాసిక్ ప్రాంతాలతోపాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాలకు రూ.2105 కోట్లు కేటాయించినట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ టీం వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు పునరావస శిబిరాలు ఏర్పాటు చేయడంతోపాటు వారి కోసం మెడికల్ క్యాంపులను నిర్వహిస్తోంది. బాధితులను పరీక్షించి వారికి అవసరమైన మందులను కూడా అందిస్తోంది.

1170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles