చైన్‌ స్నాచింగ్‌ బెడిసికొట్టింది..ఈ వీడియో చూడండి

Tue,September 3, 2019 06:20 PM

chain snatchers caught red handed by a woman in delhi


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోజూ ఎక్కడో ఓ చోట చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఢిల్లీలో ఓ చైన్‌ స్నాచింగ్‌ ఘటన జరిగింది. అయితే దొంగ మాత్రం చైన్‌ స్నాచింగ్‌ చేసే ప్రయత్నంలో అడ్డంగా దొరికిపోయాడు. ఆగస్టు 30న నంగ్లోయ్‌ ప్రాంతంలో ఓ మహిళ తన కూతురితో కలిసి నడుచుకుంటూ వెళ్తుంది. వెనక నుంచి ఇద్దరు చైన్‌ స్నాచర్లు బైకుపై వారిని ఫాలో అయ్యారు. బైకు వెనుకసీటుపై ఉన్న వ్యక్తి ఆ మహిళ మెడలో నుంచి చైన్‌ లాగాడు. ఆ మహిళ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఆ దొంగ చేయిని గట్టిగా పట్టుకుంది. దొంగ ఎంత ప్రయత్నించినా సదరు మహిళ మాత్రం అతన్ని అస్సలు విడిచిపెట్టలేదు. ఇంతలోనే అటుగా వెళ్తున్న వ్యక్తులు వచ్చి ఆ దొంగకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ చైన్‌ స్నాచింగ్‌ ఫెయిల్‌ ఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది.4713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles