మోహన్ భగవత్ కాన్వాయ్ ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి

Thu,September 12, 2019 10:19 AM

Car In Mohan Bhagwat Convoy Hits Bike Kills 6 Year Old In Rajasthan

జైపూర్ : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కాన్వాయ్‌లోని ఓ కారు ఆరేళ్ల బాలుడితో పాటు అతడి తాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, తాత తీవ్రంగా గాయపడ్డాడు. తాతమనవళ్లు బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles