ఓటేసిన స‌చిన్‌ టెండూల్క‌ర్.. బాలీవుడ్ సెల‌బ్రిటీలు

Mon,October 21, 2019 12:39 PM

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లో జోరుగా అసెంబ్లీ పోలింగ్ జ‌రుగుతున్న‌ది. ముంబైలో బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఓటేశారు. మాజీ న‌టుడు ప్రేమ్ చోప్రా, డైర‌క్ట‌ర్‌-గేయ ర‌చ‌యిత గుల్జార్‌.. బాంద్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్రీతీజింతా, సుభాష్ ఘాయ్‌, వ‌రుణ్ ధావ‌న్‌, గోవిందా, జాన్ అబ్ర‌హాం, ఖైలాష్ ఖేర్‌, దియా మీర్జాలు కూడా ఓటేశారు. ఇక శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక‌రే, ఆయ‌న భార్య రెష్మి కూడా ఓటేశారు. బాంద్రా ఈస్ట్‌లో శివ‌సేన అధినేత ఓటేశారు. ఆదిత్య, తేజ‌స్ థాక‌రేలు కూడా త‌మ ఓటును వినియోగించుకున్నారు. ఓర్లీ ముంబై నుంచి ఆదిత్య థాక‌రే .. ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూడా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. వెస్ట్ బాంద్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో స‌చిన్‌, ఆయ‌న భార్య అంజ‌లీ, కుమారుడు అర్జున్ ఓటేశారు.











599
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles