మంచి నీళ్ల బోరు నుంచి రక్తం.. భయపడుతున్న స్థానికులు..

Wed,December 11, 2019 12:12 PM

లక్నో : ఉత్తరప్రదేశ్‌ హమీర్‌పూర్‌ జిల్లాలోని ఖాజోడి గ్రామంలో మంచినీటికి తీవ్ర ఇబ్బంది ఉండేది. ఆ గ్రామంలో వంద నివాసాలు ఉంటాయి. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఇటీవలే ప్రభుత్వం.. హ్యాండ్‌ పంపును వేయించింది. మంచి నీళ్లు పుష్కలంగా రావడంతో ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ సంతోషం ఎన్నాళ్లో ఉండలేదు. కొన్నాళ్లకే పరిమితమైంది. ఇటీవలే మంచి నీళ్ల బోరు నుంచి రక్తం, మాంసం, ఎముకలు వస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


బోరు నుంచి రక్తం రావడాన్ని హమీర్‌పూర్‌ కలెక్టర్‌ దృష్టికి ప్రజలు తీసుకెళ్లారు. ఈ ఘటనపై విచారణ జరపాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. బోరును పరిశీలించిన అధికారులు.. లోపల రక్తం ఆనవాళ్లు లేవని చెప్పారు. హ్యాండ్‌ పంప్‌ లోపల పాము చనిపోయి ఉంటుందని అందుకే నీళ్లలో రక్తం వస్తుందని అధికారులు చెప్పినప్పటికీ.. గ్రామస్తులు మాత్రం నమ్మడం లేదు. దీంతో ఆ బోరు వద్దకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారు. ఆ నీరు దుర్వాసన కూడా వస్తుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

4448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles