మోదీ, షా చొర‌బాటుదారులు.. లోక్‌స‌భ‌లో ర‌చ్చ‌

Mon,December 2, 2019 03:01 PM

హైద‌రాబాద్‌: లోక్‌స‌భ‌లో ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది. అస్సాం, బెంగాల్‌లో చొర‌బాటుదారుల ఏరివేత జ‌రుగుతున్న అంశాన్ని స‌భ‌లో లేవ‌నెత్తిన‌ప్పుడు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు చొర‌బాటుదారులంటూ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ ఆరోపించారు. దీంతో స‌భ‌లో బీజేపీ ఎంపీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మ‌ధ్యలో జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీనే విదేశీయురాలు అని, ఆ పార్టీ నేత‌నే చొర‌బాటుదారురాల‌ని, అందుకే ఆ పార్టీ మిగ‌తా వారిని అలాగే టార్గెట్ చేస్తుంద‌న్నారు. ఒక‌వేళ కాంగ్రెస్‌కు ఏమైనా తెలివి ఉంటే ఆ పార్టీ ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. సోనియా, రాహుల్‌లు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. అధిర్ భార‌తీయ పౌరుడేనా అన్న అంశాన్ని ప‌రిశీలించాల‌ని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలిపారు.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles