త్రిపుర చివరి రాజు జయంతి సందర్భంగా సెలవు ప్రకటన

Fri,November 8, 2019 05:16 PM

హైదరాబాద్‌: రాచరిక రాజ్యం త్రిపుర భారత యూనియన్‌లో విలీనమైన 70 ఏండ్ల తర్వాత త్రిపురను పాలించిన చివరి రాజు మహారాజా బీర్‌ బిక్రం కిశోర్‌ మణిక్యా(1908-47) జయంతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. రాజావారి స్మరనార్థం ఆయన పుట్టినరోజు అయిన ఆగస్టు 19ని బీజేపీ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మహారాజా బీర్‌ బిక్రం రాష్ర్టానికి అందించిన అపార సహకారానికి గుర్తుగా ఈ సెలవు దినాన్ని పాటిస్తున్నట్లు త్రిపుర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. రాజా బిక్రం 17మే, 1923 నుంచి 1947 వరకు త్రిపురను పాలించారు. 28 ఏప్రిల్‌,1947న రాజ శాసనం ద్వారా త్రిపురను భారత యూనియన్‌లో విలీనం చేశారు.

986
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles