మహిళా కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన ద్విచక్ర వాహనదారుడు

Fri,November 8, 2019 02:27 PM

జైపూర్‌ : ఓ ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా.. మహిళా కానిస్టేబుల్‌ను కొద్ది దూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దిద్వానా పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం 5:15 గంటలకు ఓ యువకుడు తన బైక్‌పై ముగ్గురు యువతులను ఎక్కించుకుని రైడింగ్‌ చేస్తున్నాడు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆ ద్విచక్ర వాహనదారుడిని ఓ మహిళా కానిస్టేబుల్‌ ఆపేందుకు యత్నించింది. ఈ క్రమంలో యువకుడు తన బైక్‌ను ఆపకుండా ముందుకెళ్లాడు. అంతే కాదు బైక్‌ను పట్టుకున్న కానిస్టేబుల్‌ను కూడా 50 నుంచి 60 మీటర్ల ఈడ్చుకెళ్లాడు. మొత్తానికి బైక్‌ స్లిప్‌ కావడంతో అందరూ కిందపడ్డారు. బైక్‌ నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్‌ను యశోదగా గుర్తించారు.

7022
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles