ఫోన్ కాల్ వస్తే 7 సెకన్లలోనే స్పందిస్తున్నాం..

Mon,December 2, 2019 09:26 PM


బెంగళూరు: శంషాబాద్ లో దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎవరైనా సమస్యలో ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూం, పోలీస్ స్టేషన్లకు వచ్చే కాల్స్‌కు క్షణాల్లోనే స్పందిస్తున్నారు. బాధితులకు సత్వర సాయం అందించేందుకు కాల్ వచ్చిన 7 సెకన్లలోనే స్పందించడం జరుగుతుందని బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు వెల్లడించారు.


మేం పౌరుల రక్షణ విషయంలో వందశాతం హామీ ఇస్తున్నాం. ఏ కాల్ కైనా కేవలం 7 సెకన్లలో స్పందిస్తున్నాం. వారికి ఎస్ఎంఎస్ కూడా పంపించడం జరుగుతుంది. బెంగళూరుకు వచ్చే వారికి భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని భాస్కర్ రావు భరోసానిచ్చారు.

1791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles