అయోధ్య తీర్పు వెలువరించింది వీరే..

Sat,November 9, 2019 08:43 PM

న్యూఢిల్లీ: దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో నానుతున్న వివాదాస్పద అయోధ్య కేసు తీర్పు వెలువరించింది ఐదుగురు న్యాయమూర్తుల(ప్రధాన న్యాయమూర్తి సహా నలుగురు న్యాయమూర్తులు) సుప్రీంకోర్టు ధర్మాసనం. వారి పేర్లు.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గగోయ్, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ ఎస్‌ఏ బోగ్డే, జస్టిస్ డీ వై చంద్ర చుడ్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. కాగా, తీర్పులో వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూమి రామజన్మభూమేననీ వారు తెలిపారు. సున్నీ వక్ఫ్‌బోర్డుకు అందులో ఎలాంటి హక్కు లేదని చెప్పారు. ప్రత్యామ్నయంగా, వారికి అన్యాయం జరగకుండా అయోధ్యలో 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. ఈ తీర్పును ఇరుపక్షాలు అంఘీకరించడం సంతోషించదగ్గ విషయం. ఈ చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌కి చివరిది కానున్నట్లు సమాచారం. త్వరలో ఆయన పదవీకాలం ముగియనున్నది.

810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles