అయోధ్య వివాదాన్ని సున్నితంగా పరిష్కరించాం: యూపీ సీఎం

Thu,December 5, 2019 05:43 PM

ఝార్ఖండ్‌: 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అయోధ్య వివాదాన్ని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి వివాదం లేకుండా, అతి సున్నితంగా పరిష్కరించిందని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఝార్ఖండ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఇచ్చాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి దేశంలో అనేక సమస్యలు పరిష్కరించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్‌ సమస్య ఎంత కఠినమైనదో మీకు తెసుసు. అలాంటి సమస్యను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా ద్వయం చాలా పకడ్బందీగా, ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా పరిష్కరించారనీ.. ఇది చరిత్రలో నిలిచిపోతుందని యోగీ అన్నారు.


అలాగే, 500 ఏళ్ల నుంచి వివాదం కొనసాగుతున్న అయోధ్య కేసును సైతం చాలా సున్నితంగా, అతి తక్కువ సమయంలో పరిష్కరించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌, జేఎంఎం, ఆర్జేడీకి అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే ఆ పార్టీలు ఎప్పుడూ రామ మందిరంపై పోరాడలేదని ఆయన గుర్తు చేశారు. అందుకనే ఈ సమస్య శతాబ్దాల కొద్దీ కోర్టులో దివాలా తీసినట్లు యూపీ సీఎం తెలిపారు. ఝార్ఖండ్‌ ప్రజలు ఆలోచించి, తమ విలువైన ఓటును బీజేపీకి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.


690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles