వీడియోపై నెటిజన్ కామెంట్..అర్జున్ రాంపాల్ సమాధానం

Thu,September 5, 2019 08:43 PM

Arjun Rampal trolled for riding in luxury car IN Mumbai rains

ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతోన్న సంగతి తెలిసిందే. వరద నీటిలో సామాన్య ప్రజలతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చిక్కుకుంటున్నారు. అయితే ఇటీవలే ముంబైలో ఓ లగ్జరీ కారు వరదల్లో చిక్కుకుంది. ఆ కారు వీడియోను షేర్ చేస్తూ..‘వరదనీటిలో లగ్జరీ కార్లు నడపడం చాలా కష్టం. వరదల సమయంలో కేవలం ఇండియా కార్లు మాత్రమే ముందుకు సాగగలవు..జాగ్రత్తగా నడపండి’ అని బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ పోస్ట్ చేశాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ..‘అయితే మీరు మీ రేంజ్ రోవర్ కార్ వాడటం మానేసి మారుతి ఆల్టోని కొనుక్కోండి’ అంటూ ట్రోల్ చేశాడు. ‘ఈ వీడియోను నా ఆల్టో నుంచే తీశాను’ అని అర్జున్ బదులివ్వడంతో సరైన జవాబిచ్చావంటూ అభిమానులు అర్జున్ రాంపాల్ ను ప్రశంసించారు.1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles