పారామిలటరీ బలగాల వయో పరిమితి పెంపు

Mon,August 19, 2019 08:49 PM

All CAPF personnel to retire at 60 years

ఢిల్లీ: కేంద్ర పారామిలటరీ బలగాల వయో పరిమితి పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం వెలువరించింది. 57 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్, ఏఆర్ బలగాలకు వయో పరిమితి ఉత్తర్వులు వర్తింపజేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఏడాది జనవరి 31న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ అన్ని విభాగాల సిబ్బందికి ఒకే విధంగా నియమావళిని వర్తింపజేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులు వెలువడిన రోజు నుంచే వయో పరిమితి పెంపు అమల్లోకి వస్తుందని హోంశాఖ పేర్కొంది.

1269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles