అయ్యప్ప భక్తులను అనుసరిస్తూ 480 కి.మీ. నడిచిన కుక్క.. వీడియో

Mon,November 18, 2019 10:41 AM

ఓ శునకం.. అయ్యప్ప భక్తులను అనుసరిస్తూ 480 కిలోమీటర్లు నడిచింది.. నడుస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ తిరుమలలో అక్టోబర్‌ 31వ తేదీన 13 మంది అయ్యప్ప భక్తులు శబరిమలకు కాలినడకన బయల్దేరారు. ఈ భక్తులను ఓ కుక్క అనుసరించింది. మార్గమధ్యలో కుక్క వెళ్లిపోవచ్చు అనుకున్నారు భక్తులు. కానీ ఆ కుక్క మాత్రం భక్తుల వెంబడే నడక సాగిస్తోంది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొట్టిగేహర వద్ద తమ యాత్ర కొనసాగుతోంది. ఇప్పటి వరకు తాము 480 కిలోమీటర్లు నడిచాము. ఆ కుక్కు తమ వెంబడే వస్తోంది. తాము ప్రిపేర్‌ చేసుకుంటున్న ఆహారాన్ని ఆ శునకానికి కూడా పెడుతున్నాం. ప్రతి ఏడాది శబరిమలకు కాలినడకన వెళ్తాం. ఈ సారి కుక్క తమ వెంట నడక సాగించడం కొత్త అనుభూతిని ఇస్తుందన్నారు అయ్యప్ప భక్తులు.3594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles