గాయపడ్డ పులిని ఫొటో తీయబోయాడు..ఏమైందో చూడండి..వీడియో

Mon,August 19, 2019 06:55 PM

A man trying to take An injured leopard photo in Alipurduar

పశ్చిమబెంగాల్ : రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఓ పులి పడిపోయి ఉంది. స్థానికులు ఆ పులిని చూసి చనిపోయిందేమో అనుకున్నారు. అందరూ రోడ్డు పక్కనున్న ఆ పులిని తీక్షణంగా చూస్తున్నారు. వారిలో ఓ వ్యక్తి మాత్రం ఆ పులిని దగ్గరునుంచి ఫొటో తీయాలనుకుని కంగుతిన్నాడు. అయితే సదరు వ్యక్తి గాయంతో లేవలేని స్థితిలో ఉన్న చిరుత దగ్గరగా వెళ్లి దాన్ని ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు.

ఆ వ్యక్తి చేష్టలకు నొప్పితో బాధపడుతున్న పులికి చిర్రొత్తుకొచ్చింది. వెంటనే ఫొటో తీస్తున్న ఆ వ్యక్తిపై పులి దాడి చేసింది. అందరి అరుపులకు పులి భయపడ్డంతో..అతను దాన్ని వదిలించుకుని రోడ్డుపైకి వచ్చాడు. ఆ తర్వాత గాయం నొప్పికి చిరుత మళ్లీ కింద పడిపోయింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమందించారు. పులికి చికిత్సనందించి కోలుకున్న తర్వాత దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.7313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles