రెండో అంతస్తు నుంచి రిక్షాలో పడ్డ చిన్నారి..వీడియో

Sun,October 20, 2019 03:08 PM


మధ్యప్రదేశ్ : చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డది. మధ్యప్రదేశ్ టికంగఢ్ లోని ఓ భవనంలో రెండో అంతస్థులో చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. అయితే చిన్నారి కిందపడే సమయానికి కింద నుంచి రిక్షా వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. చిన్నారి నేరుగా రిక్షాలో పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. నా కొడుకు ఆడుకుంటుండగా కింద పడ్డాడు. స్వల్పగాయాలతో ఉన్న కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నాడని చిన్నారి తండ్రి చెప్పాడు. కింద పడ్డ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది.



2556
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles