ఆడపులి కోసం కొట్టుకున్న మగ పులులు..వీడియో వైరల్

Thu,October 17, 2019 04:05 PM


రెండు పులులు ఓ ఆడపులి కోసం కొట్టుకున్నాయి. రాజస్థాన్‌లోని రణ్‌తంబోర్ నేషనల్ పార్కులో రెండు పులులు పోట్లాడుకున్న వీడియో ఇపుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. సింగిస్థ్, రాకీ (రెండు మగపులులు) నూర్ అనే ఆడ చిరుత కోసం ఘర్షణకు దిగాయి. రెండు పులులు అతిభయంకరంగా గాండ్రిస్తూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. రెండు పులులు కొట్టుకుంటుండగా భయంతో నూర్ (ఆడపులి) అక్కడి నుంచి పరుగులు తీసింది. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ పర్వీన్ కశ్వన్ ట్విట్టర్ ద్వారా రెండు పులుల మధ్య జరిగిన యుద్దాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ఈ వీడియోకు ఒక్కరోజులోనే 24వేల వ్యూస్ వచ్చాయి. షర్మిలి అనే చిరుతపులికి సింగిస్థ్, రాకీ జన్మించాయి.3932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles