‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
వరంగల్- ఖమ్మం- నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని...
– అమలకు నోచుకోని జాబ్ క్యాలెండర్
– ఉద్యోగార్డులు, విశ్రాంత ఉద్యోగులతో రాకేశ్‌రెడ్డి ముఖాముఖి చర్చ
– కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి విస్తృత పర్యటన
కోదాడ, నవంబర్ 24 : వరంగల్- ఖమ్మం- నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ పట్టణంలో మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కె ఆర్ ఆర్ కళాశాల మైదానాల్లో మార్నింగ్ వాక్ చేస్తున్న పట్టభద్రులను, యువకులను కలిసి మద్దతు కోరారు. దీంతోపాటు పలు కూడళ్లలో ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం పట్టణంలోని గ్రంథాలయాన్ని సందర్శించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. వారి విద్యా, ఉద్యోగ సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తదితర అంశాలపై యువతతో చర్చించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, నిరుద్యోగుల సంక్షేమానికి సమచిత ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ యువతకు అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి వారి భవిష్యత్‌కు తమ వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. తదనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో సంఘ ప్రతినిధులను సభ్యులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీవితాంతం ప్రభుత్వానికి, ప్రజలకు సేవలందించిన విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం కూడా అనేక ఆర్థిక, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వైద్య ఆరోగ్య పథకం, పాత పెన్షన్ విధానం వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని, వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగులకు అలవికాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు మొండి చేయి చూపిందని విమర్శించారు. మూడేళ్లు గడుస్తున్నప్పటికీ హామీల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపించారు. యువతకు ప్రకటించిన యూత్ డిక్లరేషన్‌లోని హామీలు అమలుకు నోచుకోలేదని, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసి ఎంపిక చేసిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేయడం తప్ప ఒరగ పెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ పూసే లేదన్నారు. తనకు మద్దతు ఇచ్చి గెలిపిస్తే నిరుద్యోగ యువత, విశ్రాంతి ఉద్యోగుల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ఒక అభ్యర్థి గెలుపు కోసం మాత్రమే కాకుండా నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యావంతుల సమస్యలను శాసనమండలిలో వినిపించే నాయకుడు కావాలని.. రాకేశ్ రెడ్డికి ఆ సత్తా ఉందన్నారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణకు, యువత భవిష్యత్‌కు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులు, యువత, నిరుద్యోగులు, పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, మండల నాయకులు జానకి రామాచారి, భూపాల్ రెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి, ఉపేందర్, ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, భాగ్యమ్మ, కరీముల్లా, బాబా, వంశీ, గంధర్ శీను, నాగరాజు, చలిగంటి వెంకట్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
Phule Movie | సామాజిక విప్లవకారుల స్ఫూర్తిదాయక గాథ.. నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే’!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

