రాయపోల్, జూన్ 24: అభం శుభం తెలియని చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన దౌల్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బాలుడు (16) ఇంటి ముందు ఉండే చిన్నారి (5)ని రోజూ ఎత్తుకొని ఆడిస్తుండేవాడు. చిన్నారి వీళ్ల ఇంటికెళ్లి ఆడు తూ పాడుతూ రోజూ తిరుగుతుండేది. ఆదివారం సాయత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై బాలుడు లైంగికదాడికి పాల్పడుతుండుగా గమనించిన చిన్నారి బంధువులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు అనంతరం చిన్నారి తండ్రి దౌల్తాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోక్సో కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దౌల్తాబాద్ ఎస్సై శ్రీరామ్ ప్రేమ్దీప్ తెలిపారు.