Rain in Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. కంది, సంగారెడ్డి, పోతిరెడ్డిపల్లి, మల్కాపూర్, మామిడిపల్లి, ఫసల్వాదిలో ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దాంతో ఆయా ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి.
ఇదిలావుంటే రాష్ట్రంలో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలు ఎండ, రాత్రిపూట వానలు పడుతున్నాయి. అయితే చిన్నచిన్న వానలు పడుతుండటంతో వాతావరణంలో ఇంకా వేడి తగ్గలేదు. పగటిపూట తీవ్ర ఉక్కపోత ఉంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.