గమ్యంలేని సంచారం


Mon,October 14, 2019 01:35 AM

జాత్యభిమానం బలంగా గల పోలిష్ సంప్రదాయ సమాజంలో ఓల్గా టోకర్క్‌జుక్ ఒక సంచలనం. శాకాహారి, మహిళావాది. పోలెండ్ ఒక బాధిత సమాజంగా మాత్రమే కాదు, చరిత్రలో ఆధిపత్యం నెరిపిన సందర్భాలను కూడా గుర్తించాలని ఆమె అన్నప్పుడు పోలిష్ సంప్రదాయ సమాజం భగ్గుమన్నది. ఆమెను దేశద్రోహిగా ముద్రవేసింది. ఆమె పుస్తకాల ప్రచురణకర్త అంగరక్షకులను ఏర్పాటు చేయవలసి వచ్చింది. అయినా ఓల్గా సాహిత్యం ఆమెను ప్రపంచ సాహిత్యంలో నిలిపాయి. దేశంలోని అత్యున్నత సాహితీ అవార్డు నైక్‌ను ఆమె రెండుసార్లు అందుకున్నారు.
nobel-prize-192
సాహిత్యంలో 2018 సంవత్సరపు నోబెల్ పురస్కారాన్ని అం దుకున్న ఓల్గా టొకర్క్‌జుక్ పోలిష్ భాషలో రాసిన బెగునీ అనే నవలను ఇంగ్లిష్‌లోకి జెనిఫెర్ క్రాఫ్ట్ ైఫ్లెట్స్ పేరుతో అనువదించా రు. బెగునీ అంటే నిరంతర సంచారం వల్ల దుష్ట ప్రభావం ఉండదని నమ్మే ఒక క్రైస్తవ సంచార కాల్పనిక తెగ. కానీ ఈ నవల ఒక సంచార తెగ గురించిన కథనం కాదు. మానవ జీవితాల సంచా రం ఇందులో ద్యోతకమవుతుంది. ఈ నవలలో ఒక దగ్గర చేరిన మనుషులంతా ఒక తెగ కాదు. ఎవరి జీవనాలు, ప్రయాణాలు వారికి. ఎవరికి వారుగానే ఒక చోట కలుస్తారు. ప్రయాణాలు సాగిస్తుంటారు.

నా పుస్తకాలు ఇంకా ముందే ఇంగ్లిష్‌లోకి అనువాదమై ఉంటే నా జీవితం ఎట్లా ఉండేదా అని ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంగ్లిష్ ప్రపంచ భాష. ఏదైనా పుస్తకం ఇంగ్లిష్‌లోకి వస్తే సార్వజనీనమవుతుంది. గ్లోబల్ పబ్లికేషన్ అవుతుంది. ఇది వాంఛనీయం కాదు. కానీ ప్రపంచంలోని భిన్న ప్రాంతాల రచయితలకు ఇదొక జీవిత వాస్తవికత.


ైఫ్లెట్ సారాంశం ప్రకారమే అయితే ఇదొక నవల కాదు. అనేక ఖండికలు ఉల్లుల్లుగా అతుక్కపోయి ఉంటయి. మానవ శరీరం, చలనం వివరించే అనేక కథలు ఇందులో ఉంటయి. ఇట్లా చెప్ప డం కూడా ఈ నవల గురించి సంపూర్ణంగా చెప్పినట్టు కాదు. ఇం దులో అనేక కథలు చిన్న ముక్కలుగా కనిపిస్తయి. ద్రవ రూపంలో అతుకుబొతుకు లేనట్టుగా నవల నిండా పరచుకుని ఉంటాయి. అర నిండా అనేక కుతూహలాలు! జీవుల చరిత్ర మ్యూజియం నిర్మాణానికి ముందున్నట్టుగా ఉంటుంది. అనేక భిన్న పరిమాణా ల సొరుగులు.. అందులో వీక్షకులకు ఆసక్తిదాయకంగా .. జంతువులు, మొక్కల జాతుల నమూనాలు, ఖనిజాలు, మానవ నిర్మితాలు. ఒక సొరుగు తెరిస్తే మరో సొరుగు కనిపిస్తుంది. వాటిలో అనేక నిక్షేపాలు. ఎవరి జీవిత కథలు వారివి. సెలవుల సందర్భం గా యాత్రకు వెళ్ళినప్పుడు భార్య, కొడుకు తప్పిపోయిన మనిషి వెదుకులాట. మానవ అంగాలను గాజు సీసాల్లో భద్రపరిచే వైద్యు డి ఆలాపనలు. రసాయన లేపనం చేసిన రాజోద్యోగి భౌతికకా యం ప్రదర్శనకు పెట్టిన నేపథ్యంలో- కుమార్తె వ్యథార్థ లేఖల పరంపర. ఈ కథనాలన్నీ వేటికవే.. కానీ ఏదో తాత్త్విక భావజాలం వాటిని కలుపుతుంది.

మానవ అవయవాలు (తెగిన అవయవం, ఖననం చేయడానికి కొంచబోతున్న గుండెకాయ, చేతిపై పచ్చబొట్టు), ప్రయాణాలు (పటాలు, విమానాశ్రయాలు, రహదారులు, పడవలు) ఇవన్నిటి మధ్య ఒక్కో అధ్యాయంలో నిర్మలత్వం. వీటిని చదువుతూ ఉంటే టెలిస్కోప్‌ను అటూఇటూ తిప్పుతూ ప్రపంచాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. ఓల్గా నవలలోని పాత్ర లు ఇతరులతో కలిసిపోవడానికి ఇబ్బంది పడుతుంటాయి. కథనాలన్ని విడిగా ఉం టాయి కనుక ప్రజల ముడుచుకున్న స్వభావాన్ని ఒలిచి చూపుతూ ఉంటుంది. భిన్న స్రవంతుల భావజాలాలు అభిరుచులను కలగాపులంగా కలబోసినట్టు సాగుతుంది. ఇందులో పాత్రలకు పరస్పర సంబంధం ఉండదు. అయినా ఒకే ప్రదేశంలోకి చేరుతారు కనుక ఒక దగ్గర ఉంటారు. విమానాశ్రయం కావచ్చు, మ్యూజియం కావచ్చు. ఏదో వింతదనం, అధివాస్తవికత నిండిపోయినట్టుగా కనిపిస్తుంది. రచయిత్రి ఓల్గా టోకర్క్‌జుక్ భిన్న అంశాలపై చర్చిస్తారు. కానీ పాత్రలన్నీ వింతగానూ ఉంటాయి.

ఈ పుస్తకాన్ని ఏకబిగిన చదివితే తలనొప్పి రావడం ఖాయం. చాక్లెట్స్ అన్నీ నోట్లో కుక్కుకున్నట్టుగా ఉంటుంది. తీరికగా ఒక్కో చాక్లెట్‌ను చప్పరించినట్టుగా కొంతకొంత చదువాలె. ఇదొక గమ్యం లేని ప్రయాణం. సూటిగా సాగే కథను కోరుకునే పాఠకులు నిరాశపడుతరు. కానీ భూమి అంచులు దాటి ప్రయాణించాలనే బాపతు మనుషులకు మాత్రం ఈ సంచారం నచ్చుతుంది.

- సిల్వియా మారినో- గార్సియా
(కెనడా రచయిత్రి, ఎడిటర్, ప్రచురణకర్త)
ఎన్పీఆర్ సౌజన్యంతో...


nobel-prize2-2019

నోబెల్ వివాదం

నోబెల్ బహుమతి వివాదాలకు అతీతం కాదు. ఈ నోబెల్ కమిటీ ఎప్పుడూ యూరప్ దాటి బయటకు రాదనేది ఒక విమర్శ. 1913లో రవీంద్రనాథ్ టాగోర్‌కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. దీంతో యూరప్ కేంద్రంగా ఉండే ఈ బహుమతి ప్రపంచస్థాయికి ఎదిగిందనే అభిప్రాయం ఏర్పడ్డది. కానీ ఇప్పటికీ యూరప్, ఉత్తర అమెరికా రచయితలకే ఈ పురస్కారం ఎక్కువగా లభి స్తూ ఉంటుంది. ఈసారి రెండేండ్ల బహుమతులూ యురోపియన్ రచయితలకే లభించాయి.
nobel-prize-19
ఆసియాకు చెందిన మరో ఇద్దరికి కూడా నోబెల్ పురస్కారం లభించింది. లాటి న్ అమెరికాకు చెందిన గాబ్రియెలా మిస్ట్రాల్, మైగెల్ ఏంజిలా ఆస్టురియాస్, పాబ్లో నెరు డా, గాబ్రియెల్ గార్సియా మార్కెజ్‌లకు లభించడం కొంత ఊరట. కెన్యాకు చెందిన గూగీ థియాంగో, సిరియా దేశపు ఆదోనిస్ వంటి గొప్ప రచయితలను నోబెల్ కమిటీ ఎందుకు గుర్తించడం లేదనే విమర్శలున్నా యి. ఆఫ్రికాకు చెందిన వోలె సోయింకా, గార్డిమెర్, మేరి యో వర్గాస్ లోసా కూడా నోబెల్ బహుమతి లభించింది. టోనీ మారిసన్ ఆఫ్రికన్ అమెరికన్ రచయిత కూడా ఈ పురస్కా రం అందుకున్నారు. అయినా నోబెల్ బహుమతి ప్రపంచస్థాయికి ఎదుగలేదనేది వాస్త వం.

పాశ్చాత్య మీడియా యుద్ధాన్ని సొమ్ము చేసుకుంటున్నది. మొదట మీరు బాంబులు కురిపిస్తారు. ఆ తరువాత వాటి కథనాలు ప్రచారం చేసి సొమ్ము చేసుకుంటారు. మొదట విధ్వంసం చేసి ఆ తరువాత శాంతిదూతల అవతారం ఎత్తే దేశాల మాదిరిగానే మీడియా కూడా వ్యవహరిస్తున్నది.


ఈ ఏడాది సాహిత్య రంగ నోబెల్ పురస్కారం పీటర్ హండ్‌కేకు ప్రకటించడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తలలో వ్యతిరేకత వ్యక్తమైంది. యుగోస్లావియా ముక్కలైన నేపథ్యం లో జాతుల వైరం నెలకొని ఊచకోతలు సాగా యి. ఈ నేపథ్యంలో ఊచకోతకు పాల్పడిన సెర్బ్ నాయకుడు మైలొసెవిక్‌ను హండ్‌కే సమర్థించాడు. యుద్ధనేరాలకు పాల్పడిన మైలొసెవిక్ విచారణను ఎదుర్కొంటున్న దశలోనే మరణించాడు. హాండ్‌కే ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళి అర్పిస్తూ మాట్లాడా డు. ఊచకోతను సమర్థించిన రచయితకు నోబెల్ పురస్కారం ఇవ్వడమేమిటనే విమర్శ లు అమెరికా, యూరప్ అంతటా వెల్లువెత్తుతున్నాయి. కానీ హండ్‌కే పాశ్చాత్య దేశాల ప్రచారాన్ని తప్పు పడుతున్నాడు. ఇరాక్, లిబి యా, ఆఫ్ఘనిస్థాన్, సిరియా దేశాల కన్నా ముం దే అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు సెర్బియాలో విధ్వంసం సృష్టించాయి. పాశ్చా త్య మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదనే ది హండ్‌కే ఆరోపణ. నాటో క్రిమినల్స్ సెర్బియాపై బాంబులు కురిపిస్తే, ఆ సెర్బియానే నా నివాస స్థలమవుతుంది అన్నాడాయన. పాశ్చాత్య మీడియా యుద్ధాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. మొదట మీరు బాంబులు కురిపిస్తారు.

ఆ తర్వాత వాటి కథనాలు ప్రచా రం చేసి సొమ్ము చేసుకుంటారు. మొదట విధ్వంసం చేసి ఆ తర్వాత శాంతిదూతల అవతారం ఎత్తే దేశాల మాదిరిగానే మీరు కూడా అని హండ్‌కే మీడియాను దుయ్యబట్టాడు. ఇటీవల కొసోవా అల్బేనియన్ శరణార్థలను కూడా ప్రస్తావిస్తూనే, నాటో బాంబుదాడుల వల్ల బాధితులైన సెర్బులను కూడా ప్రస్తావించారు. ఆ పరిస్థితుల్లో మైలొసొవిక్ చేయగలిగేదే చేశాడు అంటూ సమర్థించాడు. 1996 నాటి ట్రావెలాగ్- ఎ జర్నీ టు ది రివర్స్: జస్టి స్ ఫర్ సెర్బియా వివాదం సృష్టించిం ది. బెల్‌గ్రేడ్‌పై నాటోబాంబు దాడులకు నిరసన గా 1999లో జర్మనీ ప్రతిష్ఠాత్మక బ్యూష్న ర్ ప్రైజ్‌ను హండ్‌కే తిరస్కరించారు. సెర్బుల పరిస్థితిని నాజీల పాలనలో యూదులతో పోల్చి ఆ తర్వాత ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకున్నారు. ఇందుకు జర్మన్‌ల మనోభావాలు దెబ్బతింటాయనే కారణం కావచ్చు. సెర్బుల పట్ల ఆయన వైఖరిలో మాత్రం మార్పు లేదు. అయితే బోస్నియా తదితర జాతులపై ఊచకోతలను ఖండించాల్సిందే. ఈ ఘర్షణలను ప్రేరేపించి, దాడులకు దిగిన నాటో దుశ్చర్యల మూలాలను గుర్తించి తప్పు పట్టాల్సిందే.

114
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles