ఆమె జడ కోసమే ఈ సువర్ణ సుందర మందారం విరిసిందేమో. నిశివేళ శశికాంతిలా ఆ సిరి కురుల్లో మెరిసిందేమో. ఈ పసిడివన్నె గుల్బాగ్ హెయిర్ పిన్ను నికోబార్ డిజైనింగ్ స్టూడియో తయారు చేసింది. ఫ్యాషన్ డిజైనర్ అపర్ణ చంద్ర తనకిష్టమైన మందారపువ్వు స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. ఇత్తడితో తీర్చి దిద్ది, పుత్తడి పూత పూసిన ఈ జడ పిన్ను ధర ఐదున్నర వేలు. nicobar.comలో ఆర్డర్ చేయవచ్చు.