ఆరోగ్యకరంగా బరువు
తగ్గాలనుకునేవారు చాలామంది ఓట్స్‌కు ఓటేస్తున్నారు. అందానికీ ఓట్స్ పనిచేస్తాయి. ఇంట్లోనే ఓట్మీల్ ప్యాక్ చేసుకోవచ్చు. ఒక కప్పు పాలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. దీంట్లో రెండు కప్పుల ఓట్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనపెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకటి, రెండుసార్లు చేస్తే ముఖవర్చస్సు పెరుగుతుంది.