ఏ అందగత్తెకైనా మహా అయితే ఒక కిరీటం ఉంటుంది. ఒకట్రెండు టైటిల్స్ లభిస్తాయి. గాయత్రి భరద్వాజ్ మాత్రం.. లెక్కలేనన్ని సౌందర్య కిరీటాలు ధరించింది. పుట్టగానే హెల్దీ బేబీ కిరీటం, కాలేజీలో మిస్ క్యాంపస్ కిరీటం, ఫ్యాషన్ రంగంలో మిస్ మాడల్ కిరీటం.. ఫెమినా మిస్ ఢిల్లీ, మిస్ ఇండియా.. వగైరా వగైరా. కాబట్టే, రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం కోసం ఈ అందాల ఆడపులిని ఏరికోరి తీసుకొచ్చారు.