సర్వ సాధనలో సౌందర్య సాధన ప్రధానం. అందుకు చిన్న చిన్న చిట్కాలతో.. ముఖ వర్చస్సును పెంపొందించుకోవచ్చు. ఇంటిపట్టునే ఫేస్‌ప్యాక్‌లు చేసుకోవచ్చు. వారంలో ఒకటి రెండుసార్లు కుదురుగా ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. వారాంతంలో జరిగే ఈవెంట్లో షో స్టాపర్‌గా మీరే ఉంటారు.
కొబ్బరి నూనెతో ముఖానికి ఫేస్‌ప్యాక్ వేసుకుంటే.. ముఖానికి నిగారింపు వస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో, ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా కలబంద గుజ్జు వేసి కాసేపు ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి.. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతిమంతంగా తయారవుతుంది. పొడిచర్మం ఉన్నవారికి ఈ ఫేస్‌ప్యాక్ బాగా నప్పుతుంది.
చర్మంపై ముడతల్ని నిమ్మరసం సులువుగా తగ్గిస్తుంది. దీనిలోని బ్లీచింగ్ గుణాలు మచ్చలు, ముడతల్ని దూరం చేస్తాయి. నిమ్మరసాన్ని కొద్దిగా రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది. నిమ్మరసంలో చెంచా గుడ్డు తెల్లసొన కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని.. ఆరాక గోరువెచ్చని నీటితో ఫేస్‌వాష్ చేసుకుంటే.. ముఖంపై ముడతలు తగ్గుతాయి. చర్మం కొత్త కాంతిని సంతరించుకుంటుంది.