Road Accident | రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
కోరుట్ల పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుంకెర్వర్ ప్రశాంత్ (19), గడ్డం నవీన్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుంచి మాదాపూర్ వెళ్తున్నారు.
Road Accident | కోరుట్ల, నవంబర్ 14 : కోరుట్ల పట్టణ శివారులోని మాదాపూర్ కాలనీ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దుంకెర్వర్ ప్రశాంత్ (19), గడ్డం నవీన్ ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై కోరుట్ల నుంచి మాదాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో రాయికల్ నుంచి కోరుట్ల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ప్రశాంత్ కు తలకు తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు.
నవీన్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు నవీన్ ను అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జగిత్యాలలో ని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. కాగా రహదారి పక్కన ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో రహదారిపై పూర్తిగా పొగలు అలుముకోవడంతో ఎదురుగా వస్తున్న బస్సును గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. మృతుడు ప్రశాంత్ హైదరాబాదులో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. ఇటీవల తండ్రి అశోక్ దుబాయ్ నుంచి రావడంతో ఇంట్లో జరిగే శుభకార్యానికి ప్రశాంత్ వచ్చాడు. ఇంతలోనే విధి వక్రీకరించడంతో రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
Apprentice | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 409 అప్రెంటిస్ ఖాళీలు
Suicide | కూలీ పనులు చేసి కూతురిని చదివిస్తున్న తల్లి.. యువకుడి వేధింపులకు ఆత్మహత్య..!
‘ఈ జాగ్రత్తలతో మధుమేహం నియంత్రణ’
Vaibhav Sooryavanshi: మెన్స్ టీ20 క్రికెట్లో యంగెస్ట్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

