Deeksha Divas | దీక్షా దివస్‌కు అధిక సంఖ్యలో తరలి రావాలి.. కొండన్నపల్లిలో బొట్టు పెట్టి గ్రామస్తులను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఈనెల 29న అలుగునూర్ లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సభను పురస్కరించుకొని గంగాధర మండలం కొండన్నపల్లిలో బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
Deeksha Divas | గంగాధర, నవంబర్ 24 : ఈనెల 29న అలుగునూర్ లో నిర్వహిస్తున్న దీక్షా దివస్ సభకు వేలాదిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దీక్షా దివస్ సభను పురస్కరించుకొని గంగాధర మండలం కొండన్నపల్లిలో బొట్టు పెట్టే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి మహిళలు, గ్రామస్తులకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు బీజం పడిందని గుర్తు చేశారు.
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పోవాలని, కేసీఆరే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అదే నినాదమైందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
Panchayat 5 | ఫులేరాలో మారిన రాజకీయం.. ఆకట్టుకుంటున్న ‘పంచాయత్ 5’ ట్రైలర్!
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

