Currency | టోక్యో, జూలై 3: నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు.. సరికొత్త సెక్యూరిటీ ఫీచర్స్తో జపాన్ కొత్త కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా త్రీడీ హోలోగ్రామ్స్తో కరెన్సీ నోట్లను ముద్రించింది.
త్రీడీ హోలోగ్రామ్స్ సెక్యూరిటీ ఫీచర్తో ఉన్న కొత్తగా ముద్రించిన 10 వేల యెన్, 5 వేల యెన్, 1000 యెన్ నోట్లు జపాన్లో బుధవారం నుంచి చలామణిలోకి వచ్చాయి. దేశ సంస్కృతి, శాస్త్రీయతను ప్రభావితం చేసిన చారిత్రక ప్రముఖల ఫొటోలను హోలోగ్రామ్ చూపింది. 20 ఏండ్ల తర్వాత జపాన్ కొత్త నోట్ల ముద్రణ చేపట్టింది. మారుతున్న ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త నోట్లను తీసుకురావాలని జపాన్ నిర్ణయించింది.