Additives | న్యూయార్క్, జూలై 3: రంగు, రుచి, నిల్వ సామర్థ్యాన్ని పెంచే రసాయనాల్ని సోడా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూస్లలో వాడటాన్ని అమెరికా నిషేధించింది. వీటితో గుండెపోటు, జాపకశక్తి కోల్పోవటం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆ దేశంలోని ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) పేర్కొన్నది.
ఆహార పదార్థాల తయారీలో వాడే ‘ఫుడ్ అడిటివ్స్’ ఆరోగ్యానికి హాని చేస్తాయని ఇందులో హెచ్చరించింది. ఫుడ్ అడిటివ్స్గా వాడే ‘బ్రోమినేటెడ్ వెజిటబుల్ ఆయిల్’ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ఉదహరించింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వులు ఆగస్టు 2 నుంచి అమల్లోకి వస్తాయని ఎఫ్డీఏ పేర్కొన్నది. ‘ఫుడ్ అడిటివ్స్’పై ప్రస్తుత శాస్త్ర పరిశోధనల్లో ఆందోళనకర విషయాలు బయటపడ్డాయని ఎఫ్డీఏ డిప్యూటీ కమిషనర్ చెప్పారు.