Fetus | సిడ్నీ, జూలై 4: పుట్టుకతో వచ్చే లోపాల గుట్టు తేల్చేందుకు గానూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు విప్లవాత్మక అధ్యయనాన్ని చేపట్టారు. పిండం ఏర్పడుతుండటాన్ని వీడియోగా చిత్రీకరించారు. ఇందుకు గానూ వెలుగులో రంగు మారే లైఫ్యాక్ట్ అనే ఫ్లోరెసెంట్ ప్రొటీన్ అనే పదార్థాన్ని వినియోగించారు.
ఏర్పడుతుప్పుడు మనిషి పిండంతో పోలి ఉండే ఒక పిట్ట పిండంపైన ఈ అధ్యయనం చేశారు. పక్షి పిండం గుడ్డులో ఏర్పడుతుంది కాబట్టి సులభంగా చిత్రీకరించవచ్చనే ఆలోచనతో ఈ అధ్యయనానికి పక్షిని ఎంచుకున్నారు. గుండె, వెన్నెముక, మెదడు ఏర్పడే న్యూరల్ ట్యూబ్ ఏర్పడటాన్ని పరిశోధకులు చిత్రీకరించారు.
మనుషుల్లో వందలో 3 శాతం మందికి పుట్టుకతో లోపాలు ఉంటాయని, ప్రధానంగా గుండె, న్యూరల్ ట్యూబ్‌కు సంబంధించిన సమస్యలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పిండం ఏర్పడుతున్నప్పుడే ఈ లోపాలను గుర్తించి, చికిత్స అందించేందుకు గానూ ఈ అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు.