Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
Iran-US : ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడికి సిద్దమవుతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది.
Iran-US : ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడికి సిద్దమవుతోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. తమపై అమెరికా మళ్లీ దాడి చేసినా సరే.. తమ విధానాల్లో మార్పు ఉండబోదని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇరాన్‌పై మరోసారి దాడులు తప్పకపోవచ్చని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. తాజా పరిణామాలపై అరాగ్చీ మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా మళ్లీ సైనిక చర్యకు దిగినాసరే.. మా విధానాలు మారబోవు. ప్రస్తుతం యుద్ధం గురించిన చర్చ నడుస్తోంది. యుద్ధం మళ్లీ ప్రారంభం కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. యుద్ధం జరిగినా.. జరగకపోయినా మా దేశ విధానం మాత్రం మారదు. అమెరికాకు ఏమాత్రం హేతుబద్ధత ఉన్నా సరే.. మరోసారి మా దేశంపై యుద్ధం చేయబోదు. హార్ముజ్ జలసంధి.. గతంలో యుద్ధానికి ముందు ఉన్న నాటి స్థితిలోకి తిరిగి వెళ్లదు. 40 రోజులు యుద్ధం జరగకముందు ఉన్న పరిస్థితిలోకి జలసంధి వెళ్లలేదు.
ఇది రమదాన్ యుద్ధం. ఈ యుద్ధం ప్రాంతీయ భద్రతా వ్యవస్థల్ని తలకిందులు చేసింది. ఈ ఘర్షణ కాల్పుల విరమణకే పరిమితం కాకూడదు. అన్ని రంగాల్లో యుద్ధం ముగియాలి. ఈ యుద్ధంలో అమెరికాకు చెందిన 80 యుద్ధ విమానాల్ని ధ్వంసం చేశాం. అన్నింటినీ మిస్సైల్స్ ద్వారానే కూల్చాం. ఈ ప్రాంతంలో ఉన్న అమెరికా బేస్‌లు అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. అలాగే, అక్కడి వందలాది బిల్డింగులను ధ్వంసం చేశాం అని అరాగ్చీ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

