Virtual Reality | వాషింగ్టన్: కొందరు నేరస్థుల్లో జైలు జీవితం గడిపినా మార్పు రాదు. ఇలాంటి వాళ్లలో సత్ప్రవర్తన తీసుకొచ్చే దిశగా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరం తాలూకు జ్ఞాపకాలను నేరస్థుల మెదళ్లలో ఇంప్లాంట్ చేయాలని చూస్తున్నారు.
కాకపోతే.. బాధితుడి తరఫు అంశాలను ఇందులో జోడించబోతున్నారు. బాధితుడి బాధ, కుటుంబంపై ప్రభావం.. తదితర అంశాలను చేర్చి నేరస్థుడు తను చేసింది ఎంత పెద్ద నేరమో తెలుసుకునేలా చేయటమే దీని ప్రధాన ఉద్దేశం. వర్చువల్ రియాలిటీ లాంటి ఒక పరికరం ద్వారా నేరస్థుడి మెదడులోకి బాధితుడి భావోద్వేగాలను జొప్పించి, విచారం చెందేలా చేయనున్నారు. ఈ విధానాన్ని హషీం అల్-ఘైలీ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు.