Humanoid Robot | బీజింగ్, జూలై 3: మానవ మేధస్సుతో కృత్రిమ మేధ(ఏఐ) పోటీ పడగలదా అనే చర్చలు జరుగుతున్న వేళ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు జీవశాస్ర్తానికి సాంకేతికతను జోడించి సరికొత్త సంచలనానికి తెరతీశారు. తైన్జిన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మానవ మెదడు కణాలను ఉపయోగించి ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారుచేశారు.
మూల కణాలతో ఈ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేశారు. ఈ కణాలను ఎలెక్ట్రోడ్ ద్వారా కంప్యూటర్ చిప్‌కు అనుసంధానం చేశారు. దీనికి సమాచారాన్ని ఎన్కోడ్, డీకోడ్ చేయగల సామర్థ్యం ఉంటుంది.
సాధారణ రోబోలు ముందుగా ఇచ్చిన ప్రోగ్రామ్ ప్రకారమే పని చేస్తాయని, ఈ హ్యూమనాయిడ్ రోబో మాత్రం కొత్త విషయాలు నేర్చుకోగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో ఇవి మనుషులకు వైద్య చికిత్స అందించడంలో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు.