North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
North Korean Hackers: బినాన్స్ క్రిప్టో ఏజెన్సీ నుంచి హ్యాకర్లు సుమారు 6.3 బిలియన్ల డాలర్లు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఆ చోరీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు ఉన్నట్లు క్రిప్టో నిపుణులు భావిస్తున్నారు. నార్త్ కొరియాకు చెందిన ట్రేడర్ ట్రైటర్ అనే గ్రూపు క్రిప్టో చోరీలకు పాల్పడినట్లు బ్లాక్చైయిన్ దర్యాప్తు కంపెనీ టీఆర్ఎం ల్యాబ్స్ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: బినాన్స్ క్రిప్టో ఏజెన్సీపై దాడి చేసి హ్యాకర్లు సుమారు 6.3 బిలియన్ల డాలర్లు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఆ చోరీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు(North Korean hackers) ఉన్నట్లు క్రిప్టో నిపుణులు భావిస్తున్నారు. చోరీ చేసిన క్రిప్టోలతో ఉత్తరకొరియా తన ఆయుధ సంపదను పెంచుకుంటోందని సైబర్ సెక్యూర్టీ నిపుణులు చెప్పారు. నార్త్ కొరియాకు చెందిన ట్రేడర్ ట్రైటర్ అనే గ్రూపు క్రిప్టో చోరీలకు పాల్పడినట్లు బ్లాక్చైయిన్ దర్యాప్తు కంపెనీ టీఆర్ఎం ల్యాబ్స్ పేర్కొన్నది. క్రిప్టోకరెన్సీ కంపెనీలలో ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సిబ్బందిని మోసపూరిత సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు తేల్చారు. 2025 చివర వరకు ఉత్తర కొరియా హ్యాకర్లు సుమారు 6.75 బిలియన్ల డాలర్ల క్రిప్టోకరెన్సీని మాయం చేశారు.
గతంలో బైబిట్, బిట్గెట్ లాంటి ఎక్సేంజీలను నార్త్ కొరియా హ్యాకర్లు టార్గెట్ చేశారు. నార్త్ కొరియా ఇప్పటి వరకు సుమారు 14 బిలియన్ల డాలర్ల క్రిప్టోను చోరీ చేసినట్లు సైబర్సెక్యూర్టీ పరిశోధకుడు మైఖేల్ బార్న్హర్ట్ తెలిపారు. చోరీ జరిగిన క్రిప్టోకరెన్సీని ఫ్రీజ్ చేస్తామని బినాన్స్ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 3 బిలియన్ల డాలర్ల చోరీ సొత్తును గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడర్ట్రైటర్ అనే నార్త్ కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూపు.. ఏపీటీ398 ర్యాంకులో నిష్ణాతులు అని తేలింది. మాల్వేర్, ఫోన్ ద్వారా డెవలపర్లు, ఐటీ సిబ్బందిని టార్గెట్ చేస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

