న్యూయార్క్, జూలై 3: వినికిడిలోపం ఉన్న వారికి శుభవార్త చెప్పారు అమెరికాకు చెందిన పరిశోధకులు. పూర్తిగా చెవి లోపల అమర్చ గలిగే మైక్రోఫోన్‌ను హార్వర్డ్ మెడికల్ స్కూల్, కొలంబియా యూనివర్సిటీ, ఎంఐటీ, మసాచుసెట్స్ ఐ అండ్ ఇయర్ సంస్థకు చెందిన పరిశోధకులు తయారుచేశారు. సాధారణంగా
ఇప్పుడు వినియోగించే కోక్లియర్ ఇంప్లాంట్ పరికరాలను చెవి లోపల అమర్చినప్పటికీ, బయట అమర్చే మరో పరికరం ఆధారంగా పని చేస్తుంది. పడుకునేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు దీనిని వినియోగించడం కష్టంగా ఉంటుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా తమ అంబోమైక్ సెన్సార్‌ను తయారుచేశామని, దీనిని చెవి మధ్య భాగంలో అమర్చాల్సి ఉంటుంది. బియ్యం గింజ అంత సైజులోనే ఉంటుందని, ఒకసారి అమర్చితే పదేండ్ల పాటు వినియోగించవచ్చు.