Mark Zuckerberg | అగ్రరాజ్యం అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర వేడుకలు (America Independence Day) ఘనంగా జరిగాయి. బాణ సంచా మెరుపులు, కవాతుల మధ్య అమెరికన్లు ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఇక నిత్యం బిజీబిజీగా ఉండే మెటా సీఈవో (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సైతం ఈ స్వాతంత్య్ర వేడుకలను తనదైన స్టైల్లో జరుపుకున్నారు. సర్ఫింగ్ (surfing) చేస్తూ తన డేని సరదాగా గడిపారు.
ఓ చేత్తో బీరు బాటిల్, మరో చేత్తో అమెరికా జెండాను (American flag) పట్టుకుని సముద్రపు అలలపై సర్ఫింగ్ చేస్తూ ఈ వేడుకలను జరుపుకున్నారు. మధ్య మధ్యలో బీర్‌ను తాగుతూ సర్ఫింగ్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని మార్క్ తన అధికారిక ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే, అమెరికా..!’ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో బాణ సంచాలు పేలుస్తూ.. వేల మంది గుంపులుగా చేరి ఈ రోజును వేడుకగా జరుకుంటున్నారు.
Also Read..
Kuala Lumpur airport | ఎయిర్‌పోర్ట్‌లో గ్యాస్ లీక్.. 39 మంది ప్రయాణికులకు అస్వస్థత
Amritpal Singh | జైలు నుంచి విడుదలైన అమృత్‌పాల్ సింగ్.. నేడు ఎంపీగా ప్రమాణం
Rishi Sunak | నన్ను క్షమించండి.. ఓటమిని అంగీకరించిన రిషి సునాక్