Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
Minab Attack: మినాబ్ స్కూల్‌పై దాడికి కారణమైన ఇద్దరు అమెరికా నేవీ ఆఫీసర్లను వదిలిపెట్టబోమని ఇరాన్ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. మిమ్మల్ని పట్టుకుంటాం అని ఎక్స్ అకౌంట్ ద్వారా ఇరాన్ హెచ్చరిక చేసింది.
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇరాన్‌లోని మినాబ్లోనూ ఓ స్కూల్‌పై క్షిపణులతో జరిగిన అటాక్(Minab Attack)లో సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ ఘటనకు కారణమైన ఇద్దరు అమెరికా నేవీ ఆఫీసర్లను వెతికి పట్టుకుంటామని తాజాగా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. దక్షిణాఫ్రికాలోని ఇరానీ ఎంబసీ తన ఎక్స్ అకౌంట్లో ఆ వార్నింగ్‌ను పోస్టు చేసింది. 8 నెలల క్రితం జరిగిన మినాబ్ స్కూల్ దాడి ఘటనకు కారణమైన క్రిమినల్స్ వీళ్లే అని ఇరాన్ తన పోస్టులో పేర్కొన్నది. ఆ ఇద్దర్నీ హతమారుస్తామన్న రీతిలో ఇరాన్ తన మెసేజ్‌లో తెలిపింది. ఇరాన్‌పై దాడి సమయంలో మినాబ్‌లోని ఓ స్కూల్లో ఉగ్రవాదులు ఉన్నారనన్న అనుమానంతో అటాక్ చేశారు.
నేవీ కమాండఱ్ లీగ్ ఆర్ టాటే, లెఫ్టినెంట్ కమాండ్ జెఫ్రీ ఈ యార్క్.. ఇద్దరూ మినాబ్ స్కూల్‌పై తోమాహాక్ క్షిపణులతో దాడి చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. మూడు సార్లు ఆ క్షిపణులతో అటాక్ చేశారని ఇరాన్ గతంలోనే పేర్కొన్నది. మీకు పిల్లలు లేరా అని గత పోస్టులోనే ఇరాన్ ప్రశ్నించింది. ఒకవేళ ఎవరైనా సీనియర్ అధికారిని ఇరాన్ టార్గెట్ చేస్తే, ఇక ఆ దేశం ఆచూకీ ఉండదని ఇటీవల ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇరాన్ ఆ ఆఫీసర్ల ఫోటోలను మళ్లీ పోస్టు చేసింది.
We will find you.
— Iran Embassy SA (@IraninSA) November 13, 2026
మినాబ్‌లోని షార్జే తయ్యిబ్ స్కూల్‌పై ఫిబ్రవరి 28న దాడి జరిగింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Minab Attack: మినాబ్ అటాక్.. ఆ ఇద్దర్నీ పట్టుకుంటాం.. ఇరాన్ తాజా వార్నింగ్
V Hanumantha Rao | ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్‌కు స్టెప్పులేసిన వీ హనుమంతరావు.. వీడియో
Aakasamlo Oka Tara | ఆకాశంలో ఓ తార ట్రైలర్ విడుదల.. అమ్మాయి కలకు అండగా దుల్కర్ సల్మాన్..!
AI Technology: ఏఐ టెక్నాలజీ రక్షణ కోసం శాన్ఫ్రాన్సిస్కో డిక్లరేషన్.. సంతకం చేసిన భారత్
Thailand | థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 36 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

