Iran vs US | ఇరాన్ చర్యలు ఆర్థిక ఉగ్రవాదం.. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ స్ట్రాంగ్ రెస్పాన్స్
Iran vs US | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జారీచేసిన ఆర్థిక హెచ్చరికలపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించింది. అమెరికా చర్యలు ఆ దేశ పతనానికే దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌పై ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
Iran vs US : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జారీచేసిన ఆర్థిక హెచ్చరికలపై ఇరాన్ (Iran) తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను ఆర్థిక ఉగ్రవాదంగా అభివర్ణించింది. అమెరికా చర్యలు ఆ దేశ పతనానికే దారితీస్తాయని హెచ్చరించింది. ఇరాన్‌పై ట్రంప్ ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే ఆ దేశ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఇరాన్ అధికారులు ఆరోపించారు.
భారీగా పెరిగిన అప్పులు, వడ్డీల భారం వంటి సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకే ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వారు విమర్శించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందించారు. అమెరికా సాగిస్తున్న ‘ఆర్థిక ఉగ్రవాదం’ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, వివిధ దేశాల సార్వభౌమాధికారానికి పెను ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు.
అమెరికా అప్పులు సుమారు 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని గుర్తుచేస్తూ.. ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఆ దేశ రుణభారాన్ని మరింత పెంచుతాయని విమర్శించారు. ఇరాన్‌కు సహకరించే దేశాలు తీవ్ర ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఇరాన్‌ను ఒంటరిని చేసి ఓడించేందుకు మిత్రదేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను సమకూర్చుకోకూడదని అన్నారు. అయితే ఇటువంటి విఫల విధానాలవల్ల అమెరికాకు మరిన్ని పరాజయాలు తప్పవని ఇరాన్ దీటుగా జవాబిచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rudrabhishekam | వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామికి 51 లీటర్ల ఆవుపాలతో రుద్రాభిషేకం
Lawyer remarks at CJI | ‘ఆ కుర్చీకి మీరు అర్హులు కారు’.. సీజేఐ సూర్యకాంత్‌పై న్యాయవాది అనుచిత వ్యాఖ్యలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

