Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
Qeshm Island: ఇరాన్‌కు చెందిన ఖాసిమ్ దీవిపై సోమవారం అమెరికా అటాక్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. హోర్ముజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద దీవి అది. అయిదు చోట్ల పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు ఇరానీ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొన్నది.
న్యూయార్క్: ఇరాన్‌కు చెందిన ఖాసిమ్ దీవి(Qeshm Island)పై సోమవారం అమెరికా అటాక్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. టెహ్రాన్‌తో శాంతి ప్రతిపాదన కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో ప్రగతి ఉన్నా..దాడులు జరిగినట్లు ఓ అధికారి చెప్పారు. హోర్ముజ్ జలసంధిలో ఉన్న అతిపెద్ద దీవి అది.అత్యంత రహస్యంగా దాడి ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా అధికారి వెల్లడించారు. ఖాసిం దీవిలో అయిదు ప్రదేశాల్లో పేలుళ్ల శబ్ధాలు వినిపించినట్లు ఇరానీ న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ పేర్కొన్నది. రెండు విమానాలు గాలిలో ఎగురుతూ కనిపించినట్లు స్థానికులు చెప్పారు.
తాజా దాడి గురించి అమెరికా సెంట్రల్ కమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే చాలా వారాల నుంచే స్వల్ప స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆ కథనంలో తెలిపారు. మరో వైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యంత ఎన్నికల వేళ తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. అయితే టెహ్రాన్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఖాసిం దీవితో పాటు బందర్ లెంగే దీవిపై కూడా దాడి జరిగినట్లు చెబుతున్నారు.
ఇటీవల అమెరికాకు చెందిన మూడు డ్రోన్లను హోర్ముజ్ సమీపంలో కూల్చినట్లు ఇరానీ రెవల్యూషనరీ గార్డు దళాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంట్లో ఒకటి MQ-9 మిలిటరీ డ్రోన్ కూడా ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తల్లిని, బిడ్డని ఒక్కటి చేసి..ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్
Jobs | అటామిక్ ఎనర్జీలో 254 టీచర్ పోస్టులు.. నవంబర్ 22 చివరితేదీ
Tusshar Kapoor | రూ.5 కోట్లు ఇవ్వకుంటే లేపేస్తాం.. మరో బాలీవుడ్ నటుడికి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు..!
Abdulla Shahid: చిన్నారిపై లైంగిక వేధింపులు.. మాల్దీవులు మాజీ విదేశాంగ మంత్రి అరెస్టు
AP News | తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా.. మూడు వార్డుల్లోనే వైసీపీ ఆధిక్యం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

