ప్రపంచంలోని ప్రతి వ్యక్తి లేదా పిల్లవాడు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా రూబిక్స్ క్యూబ్‌తో ఆడుకుని ఉంటారు. కొంతమంది రూబిక్స్‌ను ఈజీగా సాల్వ్ చేస్తుంటారు. 30 సెకన్ల కంటే తక్కువ వ్యవధిలో రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించే భారతీయ చిన్నారులు కూడా ఉన్నారు. అయితే, ఇందుకు సంబంధించిన ట్రిక్ తెలిస్తే మీరూ ఈజీగా పరిష్కరించొచ్చని చెబుతున్నారు నిపుణురాలు పుష్పా మాంగాడే.
పుష్ప మంగాడే ఇన్స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేసిన అనేక వీడియోలు మిలియన్ల మంది వీక్షణలతో వైరల్ అవుతున్నాయి. పుష్ప తన పేజీలో వివిధ రకాల రూబిక్స్ క్యూబ్‌లను ఎలా పరిష్కరించాలో వివరించారు. రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించేందుకు ఆమె చేసిన ‘మ్యాజిక్ ట్రిక్’ అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోల్లో ఒకటి. 98.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 2.3 మిలియన్ల లైక్స్‌తో ఈ వీడియో దూసుకుపోతున్నది. మరెందుకాలస్యం మీరూ చూసి, రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసే మ్యాజిక్ ట్రిక్‌ను తెలుసుకోండి.