బీజింగ్, జూలై 1: చైనాలోని ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన స్పేస్ రాకెట్.. ప్రయోగ సమయంలో హఠాత్తుగా లాంచ్ ప్యాడ్‌ను వీడి ఆకాశంలోకి దూసుకెళ్లింది. అనంతరం అది వెంటనే ఆకాశంలో పేలిపోయి.. నేలను ఢీకొన్నది. ఆదివారం హెనాన్ ప్రావిన్స్‌లో ‘టియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
రాకెట్ మొదటి దశ హఠాత్తుగా యాక్టివేట్ కాగా, ఆకాశంలోకి దూసుకెళ్లి కుప్పకూలింది. రాకెట్ బాడీ, టెస్ట్ బెంచ్‌కు మధ్య నిర్మాణపరమైన వైఫల్యం రాకెట్ ప్రమాదవశాత్తు కుప్పకూలడానికి దారితీసిందని ‘టియాన్‌బింగ్ టెక్నాలజీ’ కంపెనీ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. లాంచ్ ప్యాడ్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలోని పర్వతప్రాంతాల్లో రాకెట్ కుప్పకూలిందని, ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని కంపెనీ తెలిపింది.