Chang’e-6 | బీజింగ్, మే 3: చంద్రుడి ఉపరితలం నుంచి శిలలు, మట్టి నమూనాలు సేకరించేందుకు చైనా ప్రయోగించిన చాంగే-6 మిషన్ విజయవంతమైంది. ఈ మేరకు శుక్రవారం చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటన విడుదల చేసింది.
వెన్‌ఛెంగ్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్-5 రాకెట్ ద్వారా దీన్ని విజయవంతంగా ప్రయోగించినట్టు వెల్లడించింది. భూమికి ఆవల దిక్కున ఉన్న చంద్రుడి ఉపరితలం (చంద్రుడి దక్షిణ ధ్రువం)పై చాంగే-6 ల్యాండ్ అయ్యి, అక్కడ 2 మీటర్ల లోతు నుంచి 2 కిలోల నమూనాలను సేకరించి, తిరిగి భూమిపైకి రానున్నది.