Russia vs Ukraine | రష్యా చమురుశుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..!
Russia vs Ukraine | రష్యా (Russia) లోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్ల (Drones) తో విరుచుకుపడింది. కిరిషి ప్రాంతంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి చేయడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గతంలో ఇదే కర్మాగారాన్ని కీవ్ తీవ్రంగా దెబ్బతీయడంతో మాస్కో తిరిగి పునరుద్ధరించింది. మరికొద్ది రోజుల్లో కర్మాగారంలో పనులు తిరిగి ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఈ దాడి జరగడం గమనార్హం.
Russia vs Ukraine : రష్యా (Russia) లోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ (Ukraine) డ్రోన్ల (Drones) తో విరుచుకుపడింది. కిరిషి ప్రాంతంలోని ఒక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి చేయడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గతంలో ఇదే కర్మాగారాన్ని కీవ్ తీవ్రంగా దెబ్బతీయడంతో మాస్కో తిరిగి పునరుద్ధరించింది. మరికొద్ది రోజుల్లో కర్మాగారంలో పనులు తిరిగి ప్రారంభం అవ్వాల్సి ఉండగా ఈ దాడి జరగడం గమనార్హం. రోజుకు నాలుగు లక్షల బ్యారెళ్ల సామర్థ్యంగల ఈ ప్లాంట్ డీజిల్, గ్యాసోలిన్, ఫ్యూయల్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తుంది.
ఉక్రెయిన్ ప్రయోగించిన దాదాపు 494 డ్రోన్లను విజయవంతంగా కూల్చేసినట్లు రష్యా వెల్లడించింది. ఈ నెలలో 20కి పైగా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు చేసినట్లు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్కు సరఫరాను కొనసాగించడానికి.. డీజిల్ ఎగుమతులపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దాడులకు ప్రతిస్పందనగా ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. వరుస దాడులు కొనసాగుతుండడంతో రష్యాలో గ్యాసోలిన్ కొరత ఏర్పడింది.
మరోవైపు శనివారం తెల్లవారుజామున కీవ్పై మాస్కో దాడి చేయడంతో పేలుడు పదార్థాలు నిల్వ ఉంచిన గిడ్డంగిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పేలుడు పరికరాలను గుర్తించి, నిర్వీర్యం చేయడానికి పైరోటెక్నిక్ బృందాలు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

