Apple Watch | ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. మొబైల్ ఫోన్స్‌తో పాటు స్మార్ట్ వాచ్లకు సైతం క్రేజ్ ఉన్నది. ప్రస్తుత కాలంలో స్మార్ట్ వాచ్‌లను కేవలం టైమ్ కోసం కాకుండా ఫిట్నెస్ డేటాను ట్రాక్ చేసుకునేందుకు వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా రన్నింగ్, స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, జిమ్‌లో వర్కవుట్స్ సహా పలు హెల్త్ అలెర్ట్‌ల కోసం వినియోగిస్తుంటారు. అయితే, ఆపిల్ ఉత్పత్తుల క్వాలిటీ మిగతా ఉత్పత్తులతో పోలిస్తే కొంత బెటర్‌గానే ఉంటాయి. ఆపిల్ వాచ్‌లు నీటిలో వాడుకునేందుకు అవకాశం ఉన్నా.. మరీ ఎక్కువగా వాడినా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన ఆపిల్ స్మార్ట్ వాచ్‌ను సముద్రంలో పడేసుకున్నాడు. ఈ వాచ్ మళ్లీ దాదాపు ఏడాదిన్నర తర్వాత అతనికి చేతికి చిక్కింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ వాచ్ ఇంకా పని చేస్తూనే ఉన్నది. జారెక్ బ్రిక్ వివరాల ప్రకారం.. అతుడు 2022 జూన్‌లో కరేబియన్స్ దీవుల్లో స్కూబా డైవింగ్ చేసిన సమయంలో వాచ్ పోగొట్టుకున్నాడు. డైవింగ్‌కి వెళ్లే సమయంలో చేతికి వాచ్‌ను ధరించగా.. తిరిగి వచ్చే సమయంలో వాచ్ చేతికి కనిపించలేదు. సముద్రంలోని అందాలను చూస్తూ ఉండిపోయాయని.. ఈ క్రమంలో చేతికి ఉన్న వాచ్‌ని గమనించలేదని చెప్పాడు. వాచ్ సముద్రంలో పడిపోయినప్పటికీ ఏదో చిన్న ఆశతో ఫైండ్ మై నెట్వర్క్ వాచ్‌లో వాచ్ పోయినట్లుగా మార్క్ చేశాడు. తన వాచ్‌కు తనకు దొరక్కపోతుందా? అని చిన్న ఆశతో ఈ పని చేయగా.. ఆశ్చర్యకరంగా వాచ్ పోయిన ప్రాంతానికి సమీపంలో నివసించే ఓ వ్యక్తిని ఒక వాయిస్ మెయిల్ వచ్చిందని.. వాచి దొరికినట్లుగా చెప్పారని జారెడ్ బ్రిక్ పేర్కొన్నారు. వాచ్ అద్భుతంగా ఇంకా పనిచేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తుందని.. ‘ఫైండ్ మై నెట్వర్క్’ ఫీచర్‌పై బ్రిక్ సెట్ చేసిన మెసేజ్ వాచ్‌పై డిస్ప్లే కావడంతో అతన్ని చేరింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది.